డాక్టర్ల బృందానికి బ్రెజిల్ ప్రజల వీడ్కోలు
- December 12, 2018
బ్రసీలియా : దాదాపు 200మంది క్యూబా డాక్టర్లు బ్రెజిల్ వీడి వెళుతుంటే బ్రెజిల్ ప్రజలు వారికి భావోద్వేగంతో కూడిన వీడ్కోలు ఇచ్చారు. 'థాంక్యూ క్యూబా' అంటూ రాసి వున్న పోస్టర్లను ప్రదర్శించారు. బ్రసీలియాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. క్యూబా డాక్టర్ల మానవత్వం, వారి వైద్య నైపుణ్యాలు కలకాలం తాము గుర్తుంచుకుంటామని పేర్కొన్నారు. బ్రెజిల్లో ఎలాంటి వసతులు లేని చోట కూడా అద్భుతమైన సేవలందించారని పేర్కొంటూ వారి సేవలను కొనియాడారు. 'ఇదొక దుర్దినం, 6లక్షల మందికి పైగా బ్రెజిలియన్లు డాక్టర్లు లేకుండా వుండాల్సిన పరిస్థితి వస్తోంది. గత ఐదేళ్ళుగా అత్యాధునికమైన వైద్య సేవలను అందించిన క్యూబన్లకు ఇప్పుడు వీడ్కోలు పలకాల్సి వస్తోంది.' అని ప్రొఫెసర్ రొనాల్డొ ఫెరీరా వ్యాఖ్యానించారు. ఇలా డాక్టర్లు వెళ్ళిపోవడం వల్ల ముందుగా ప్రభావితమయ్యేది మారుమూల ప్రాంతాల్లోని నిరుపేద ప్రజలని అన్నారు. ఇన్నాళ్ళుగా తమతో వున్న క్యూబన్ డాక్టర్ల సేవలకు గుర్తింపుగా, వారి పట్ల గౌరవం, కృతజ్ఞతతో తాము వీడ్కోలు పలుకుతున్నామని చెప్పారు. బ్రెజిల్లో మాస్ మెడికోస్ కార్యక్రమం చాలా కీలకమైన ప్రాజెక్టు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







