యూఏఈలో అగ్ని ప్రమాదం: ఏడేళ్ళ చిన్నారి మృతి
- December 12, 2018షార్జాలోని ఓ భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా, ఈ ప్రమాదంలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. బాధిత చిన్నారిని అరబ్ జాతీయురాడిగా గుర్తించారు. అగ్ని ప్రమాదం కారణంగా బాధిత చిన్నారి ఎక్కువగా పొగ పీల్చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అతడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించినా, ప్రాణాల్ని కాపాడలేకపోయారు. షార్జా సివిల్ డిఫెన్స్ ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని ఉదయం 11.03 నిమిషాల సమయంలో అందుకుంది. సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కులాయా ప్రాంతంలోని ఓ రెసిడెన్షియల్ భవనం ఐదో ఫ్లోర్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంతో ఫ్లాట్‌లోని సామాగ్రి పూర్తిగా కాలి బూడిదైపోయింది. చిన్నారి ప్రాణాలు కోల్పోగా, మిగతా కుటుంబ సభ్యులు క్షేమంగానే వున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..