నీరసించిన రూపాయి!

- December 12, 2018 , by Maagulf
నీరసించిన రూపాయి!

రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ ఊర్జిత్‌ పటేల్‌ రాజీనామా చేయడంతో మంగళవారం షాక్‌తిన్న దేశీ కరెన్సీ మరోసారి నీరసంగా ప్రారంభమైంది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభంలోనే 17 పైసలు(0.24 శాతం) బలహీనపడి 72.02కు చేరింది. మంగళవారం డాలరుతో మారకంలో రూపాయి 53 పైసలు(0.7 శాతం) నష్టపోయి 71.85 వద్ద ముగిసింది. అయితే తొలుత ఒక దశలో 110 పైసల వరకూ పతనమైంది. 72.42 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.

తదుపరి దేశీ స్టాక్‌ మార్కెట్లు కోలుకోవడంతో రూపాయి సైతం బలపడింది. నష్టాలను కొంతమేర రికవర్‌ చేసుకుని 71.67వరకూ పుంజుకుంది. చివరికి 71.85 వద్ద స్థిరపడింది. మంగళవారం ఇంట్రాడేలో సాంకేతికంగా కీలకమైన 72 మార్క్‌ను సైతం దాటి బలహీనపడిన రూపాయి నేటి ట్రేడింగ్‌లో మరోసారి నీరసంగా కదులుతోంది. ఇది మూడు వారాల కనిష్టంకాగా.. ఊర్జిత్‌ పటేల్‌ పదవికి రాజీనామా చేయడంతో రిజర్వ్‌ బ్యాంక్‌ కొత్త గవర్నర్‌గా ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంతదాస్‌ను ఎంపిక చేసినట్లు ప్రకటించింది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com