ఫేస్‌బుక్‌కు బాంబు బెదిరింపు..కొన్ని భవనాలను ఖాళీ చేయించినట్లు ప్రకటన

- December 12, 2018 , by Maagulf
ఫేస్‌బుక్‌కు బాంబు బెదిరింపు..కొన్ని భవనాలను ఖాళీ చేయించినట్లు ప్రకటన

కాలిఫోర్నియా: అమెరికాలోని ఫేస్‌బుక్‌ ప్రధాన కార్యాలయానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో కాలిఫోర్నియా రాష్ట్రంలోని మెన్‌లో పార్క్‌ నగరంలోని ఫేస్‌బుక్‌ ప్రధాన ప్రాంగణంలో కొన్ని భవనాలను ఖాళీ చేయించారు. ప్రాంగణంలోని 200 జెఫ్ఫర్‌సన్‌ డ్రైవ్‌ భవనంలో బాంబు ఉందన్న అనుమానంతో ఉద్యోగులందర్నీ బయటకు పంపేసినట్లు ఫేస్‌బుక్‌ అధికార ప్రతినిధి ఒకరు మంగళవారం తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. అయితే ఉద్యోగులంతా క్షేమంగానే ఉన్నారని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రకటనలో ఫేస్‌బుక్‌ వెల్లడించింది. భవనంలో అణవణువు పరిశీలిస్తున్నట్లు మెన్‌లో పార్క్‌ పోలీసులు ట్విటర్‌ ద్వారా తెలిపారు. గతంలో యూట్యూబ్‌ సంస్థ కూడా భద్రతా పరమైన ఇలాంటి సమస్యే ఎదుర్కొంది. ఈ ఏడాది మేలో శాన్‌ఫ్రాన్సిస్‌కోలోని యూట్యూబ్‌ ప్రధాన కార్యాలయంలో ఈ లోపం బయటపడింది. ఓ మహిళ ముగ్గురు వ్యక్తులపై తుపాకీతో కాల్పులు జరిపి, తర్వాత తనను తాను కాల్చేసుకొని చనిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తూటాల గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com