పెళ్లి సందడి మొదలైంది..
- December 13, 2018
మరో సెలబ్రిటీ జంట పెళ్లికి వేళైంది. భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌ల ఇంట పెళ్లి సందడి మొదలైంది. బంధువులు, శ్రేయోభిలాషుల రాకతో సైనా, కశ్యప్‌ల ఇళ్లు సందడిగా మారాయి. ఇప్పటికే వివాహ విందు ఆహ్వాన పత్రాల్ని ప్రముఖులందరికి సైనా, కశ్యప్‌లు అందజేశారు. అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.
సైనా, కశ్యప్‌ల పెళ్లి చాలా సాదాసీదాగా జరుగుతుందని బంధువులు చెబుతున్నారు. రేపు రిజిస్టర్ మ్యారేజీ ద్వారా సైనా, కశ్యప్‌లు ఒక్కటి కానున్నారు. ఇక అదే రోజు దక్షిణ భారత సంప్రదాయం ప్రకారం ఇంట్లో పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు ఇరువురు కుటుంబ సభ్యులు.
ఈ నెల 16న వివాహ విందు ఇవ్వనున్నారు. ఈ వివాహ విందుకు క్రీడా, పారిశ్రామిక, సినీ, రాజకీయ రంగ ప్రముఖులను హాజరు కానున్నారు. గత కొన్నేళ్లుగా సైనా, కశ్యప్‌లు భారత బ్యాడ్మింటన్‌లో రాణిస్తున్నారు. అసాధారణ విజయాలతో అందరిని ఆకర్షించారు. గత కొంత కాలంగా సైనా, కశ్యప్‌లు ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి ఇరువురు కుటుంబ పెద్దలు కూడా అంగీకరించారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







