షార్జాలో 3 దిర్హామ్‌ల వరకు పెరిగిన బస్ ఛార్జీలు
- December 13, 2018
షార్జా సిటీలో బస్ ప్రయాణీకులు ఇకపై 1 నుంచి 3 దిర్హామ్‌ల వరకు అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. డిసెంబర్ 1 నుంచి అందుబాటులోకి వచ్చిన కొత్త టారిఫ్ ప్రయాణీకులకు కాస్త భారంగా మారింది. సిటీ మరియు ఇంటర్సిటీ బస్ రూట్స్‌లో ఛార్జీల్ని పెంచింది షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ. సిటీ రోడ్స్‌పై 7 దిర్హామ్‌లకు బదులుగా 8 దిర్హామ్‌లు చెల్లించాల్సి వస్తోంది. సాయెర్ కార్డ్స్‌పై ప్రయాణించేవారు 5.5 దిర్హామ్‌లకు బదులుగా 6 దిర్హామ్‌లు చెల్లించాలి. ఇంటర్సిటీ బస్ రూట్స్‌లో ప్రయాణించేవారికి మరింత అదనపు బాదుడు తప్పడంలేదు. షార్జా నుంచి అబుదాబీ లేదా అల్ అయిన్కి వెళ్ళేవారు 30 దిర్హామ్‌ల స్థానంలో 33 దిర్హామ్‌లు చెల్లించాలి. రస్ అల్ ఖైమాకు 25 దిర్హామ్‌లు గతంలో చెల్లిస్తే, ఇప్పుడు అది 27 దిర్హామ్‌లకు పెరిగింది. షార్జా నుంచి అజ్మన్కి 1 దిర్హామ్ పెరగగా, ఉమ్ అల్ కువైన్కి 2 దిర్హామ్‌లు పెరిగింది. ఛార్జీల పెరుగుదల భారంగా మారిందని ప్రయాణీకులుఅ ంటున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







