అంగరంగ వైభవంగా ఈశా-ఆనంద్‌ల పెళ్లి

- December 13, 2018 , by Maagulf
అంగరంగ వైభవంగా ఈశా-ఆనంద్‌ల పెళ్లి

 

 

దేశంలోనే అత్యంత ఖరీదైన వివాహంగా నిలిచిన ఈశా అంబానీ- ఆనంద్‌ పిరమాల్‌ల వివాహ వేడుక బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. పెళ్లి వేదికయిన ముకేశ్‌ అంబానీ స్వగృహం 'యాంటిలియా'ను దేశ విదేశాల నుంచి తీసుకొచ్చిన పలు రకాల పూలు, విద్యుద్దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గృహాల్లో ఒకటిగా పేరుగాంచిన ఈ కుబేరుడి సౌధం, ఈ అలంకరణతో మరింత ఆకర్షణీయంగా మారింది. పెళ్లికుమార్తె ఈశాను సోదరులు ఆకాశ్‌, అనంత్‌, అన్‌మోల్‌ తదితరులు ముత్యాలతో అలంకరించిన ఛాదర్‌ పట్టి మండపానికి తీసుకువచ్చారు. నృత్య కళాకారులతో బారాత్‌ బృందం ముందు రాగా.. ఆ వెనకనే రోల్స్‌ రాయల్‌ కారులో వరుడు ఆనంద్‌ పిరమాల్‌, తన కుటుంబసభ్యులతో కలిసి యాంటిలియాకు చేరుకున్నారు. పెళ్లికుమార్తె సోదరులు అశ్వాలను అధిరోహించి సందడి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com