అయ్యో..ఇచ్చిన ఆస్కార్ తీసేసుకున్నారు.!
- December 13, 2018
సినీ ప్రపంచంలో ఆస్కార్ అవార్డు పొందడమనేది అనేది చాలామంది నటీనటుల డ్రీం. అలాంటి ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న ఓ హాలీవుడ్ స్టార్ హీరో నుంచి బలవంతంగా ఆ అవార్డును తీసేసుకున్నారట. వివరాల్లోకి వెళ్తే… హాలీవుడ్ స్టార్ హీరో లియోనార్డో డికాప్రియో అంటే తెలియనివారు ఎవరుంటారు. తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు. ఇప్పటికే తన నటనకుగానూ ఐదుసార్లు ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యారు. 2016లో 'ది రెవెనెంట్' అనే చిత్రానికి ఆస్కార్ అవార్డును అందుకున్నారు. 1954లో మార్లోన్ బ్రాండో అనే నటుడు 'ఆన్ ది వాటర్ ఫ్రంట్' అనే సినిమాలో ఉత్తమ నటనకు ఆస్కార్ అవార్డును దక్కించుకున్నారు. ఈ అవార్డును మలేషియాకు చెందిన జోలో అనే పెట్టుబడిదారుడి నుంచి బహుమతిగా పొందాడు డికాప్రియో.
ఇటీవల జోలోపై ఆర్ధిక నేరాలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు జోలో బహుమతులుగా ఇచ్చిన వస్తువులను కూడా వదలకుండా తిరిగి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే జోలో నుంచి బహుమతిగా డికాప్రియో తీసుకున్న ఆస్కార్ అవార్డును బలవంతంగా తీసుకున్నారు అధికారులు. ఈ అవార్డును జోలో ఆరు లక్షల డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







