ప్రపంచం మొత్తం నాలెడ్జ్‌పై ఆధారపడి ఉందని: చంద్రబాబు

- December 23, 2015 , by Maagulf
ప్రపంచం మొత్తం నాలెడ్జ్‌పై ఆధారపడి ఉందని: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని నాలెడ్జ్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రైవేట్‌ వర్శిటీల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. బుధవారం సాయంత్రం నూజివీడు ట్రిపుల్‌ ఐటీ మొదటి స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రసిధ్ది చెందిన పది యూనివర్శిటీల శాఖలను రాష్ట్రంలో నెలకొల్పడమే ద్యేయమని చెప్పారు. ప్రైవేట్‌ వర్శిటీల్లో ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై ఆలోచిస్తున్నామని అన్నారు. నూజీవీడు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల్లో 55 శాతం విద్యార్థినులు ఉండడం మంచి పరిణామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రపంచం మొత్తం నాలెడ్జ్‌పై ఆధారపడి ఉందని, పేదరిక నిర్మూణ జరగాలన్నా, సంపద సృష్టించబడాలన్నా నాలెడ్జ్‌ చాలా ముఖ్యమని ఆయన అభిప్రాయడ్డారు. ఆ నాలెడ్జ్‌ ఇచ్చేది విద్యా సంస్థలన్న విషయం గుర్తుపెట్టుకోవాలసిన అవసరం ఉందని అన్నారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు కళాశాలలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఈ కార్యక్రమంలో బాబుతోపాటు మంత్రులు దేవినేని ఉమా, గంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com