వాషింగ్ మెషీన్‌లో ఇరుక్కుని నాలుగేళ్ళ చిన్నారి మృతి
- December 13, 2018
నాలుగేళ్ళ ఎమిరేటీ చిన్నారి వాషింగ్‌మెషీన్‌లో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయిన ఘటన అజ్మన్‌లో చోటు చేసుకుంది. అజ్మన్‌లోని అల్ రావ్దా ప్రాంతంలోగల ఓ విల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఇంట్లో గ్రాండ్ మదర్‌తో వుంటోన్న సమయంలో ఆ చిన్నారి, లాండ్రీ రూమ్‌లోకి వెళ్ళి, ఫ్రంట్‌లోడర్ అయిన వాషింగ్ మెషీన్‌లోకి దూరి, డోర్ క్లోజ్ చేసుకున్నాడు. మెషీన్ ఆటోమేటిక్‌గా హాట్ వాటర్‌తో నిండి, వాషింగ్ సైకిల్ కూడా ప్రారంభమయ్యింది. ఈ క్రమంలో బాలుడు దుర్మరణం చెందాడని పోలీసులు నిర్ధారించారు. ఆసుపత్రి నుంచి అందిన సమాచారంతో తాము కేసుని రిజిస్టర్ చేశామని చెప్పారు. వాషింగ్‌మెషీన్‌ని పగలగొట్టి, బాలుడ్ని అతడి అంకుల్ బయటకు తీశారు. ఇలాంటి హృదయ విదారక ఘటనలు తీవ్రంగా కలచివేస్తాయనీ, గార్డియన్స్ అలాగే పేరెంట్స్ తమ పిల్లల సంరక్షణ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అల్ హమైదియా పోలీస్ స్టేషన్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ యాహ్యా ఖలాఫ్ అల్ మత్రోషి విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







