హైదరాబాద్ లో భారీ వర్షం ..
- December 14, 2018హైదరాబాద్:బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. రాత్రి 9 గంటలకు మొదలైన వర్షం తెల్లవారు జామున వరకు కురిసింది. ఉదయం వర్షం తేరుకోవడం తో నగరవాసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని చోట్ల చిరు జల్లులు కురుస్తున్న వారి వారి పనులకు వెళ్లడం చేసారు.
సికింద్రాబాద్, బేగంపేట, సనత్ నగర్, అమీర్పేట, బంజారాహిల్స్, ఎల్బీనగర్, ఉప్ప ల్ , మేడ్చల్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. గురువారం మధ్యాహ్నం నుంచే ఆకాశం మేఘావృతమై వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
మరోపక్క ఆంధ్రప్రదేశ్ లో ఈ వాయుగుండం ప్రభావం ఎక్కువగా ఉంది. ముఖ్యం గా నెల్లూరు , శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖా తెలియజేసింది. సముద్ర వేట కు కూడా వెళ్లోద్దని హెచ్చరించింది. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసారు. మరోపక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు సైతం ఎప్పటికప్పుడు వర్షాల గురించి ఆరా తీస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..