మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చిత్రంతో న్యూ రూ.100 నాణెం
- December 14, 2018
న్యూ రూ.100 నాణెం త్వరలో విడుదల కానుంది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గౌరవార్థం కొత్త రూ. 100 నాణెం త్వరలో రాబోతోంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఓ అధికారిక ప్రకటన చేసింది. ఈ నాణెం 35 గ్రాముల బరువు ఉంటుంది.
నాణెం ఒక వైపు వాజ్‌పేయి చిత్రంతోపాటు ఆయన పేరు దేవనాగరి లిపి, ఆంగ్ల భాషల్లో ఉంటుంది. నాణెం దిగువన వాజ్‌పేయి పుట్టిన, మరణించిన సంవత్సరాలు 1924, 2018 అని ముద్రించి ఉంటుంది.
నాణెం మరొకవైపు సత్యమేవ జయతే పదాలతో కూడిన నాలుగు సింహాల అశోకుని స్థూపం బొమ్మ ఉంటుంది. ఒకవైపు భారత్, మరోవైపు ఇండియా అని ముద్రించి ఉంటుంది. దీనికిందనే 100 ముద్రించి ఉంటుందని ఆర్థిక శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







