తుపానుగా మరనున్న తీవ్రవాయుగుండం

- December 15, 2018 , by Maagulf
తుపానుగా మరనున్న తీవ్రవాయుగుండం

అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. మరో 12 గంటల్లో ఇది తుపానుగా మరే అవకాశం ఉంది. శ్రీహరికోటకు 790 కిలోమీటర్ల దూరంలో.. చెన్నైకి 775 కిలోమీటర్ల దూరంలో ఉన్న తీవ్ర వాయుగుండం త్వరితగతిన దిశను మార్చుకుని కదులుతుంది. ఉత్తర కోస్తాలో కాకినాడ నుంచి విశాఖపట్నం మధ్య తీరం దాటే సూచనలు ఉన్నాయి. ప్రస్తుతం గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న వాయుగుండం 17వ తేదీ రాత్రి తీరం దాటొచ్చని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అల్లకల్లోలంగా ఉన్న సముద్రం తీరం దాటే సమయంలో గంటలకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. సముద్రంలో 6 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసి పడనున్నాయి. వాయుగుండం మార్పులను అనుక్షణం గమనిస్తున్న ఆర్టీజీఎస్‌ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com