200,000 ప్రైజ్ స్కామ్: 19 మంది అరెస్ట్
- December 17, 2018
19 మంది సభ్యులుగల ముఠాని అజ్మన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోగస్ క్యాష్ ప్రైజులతో అమాయకుల్ని నిందితులు మోసం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్టయినవారంతా ఆసియాకి చెందినవారే. అజ్మన్ పోలీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ మొహమ్మద్ హమాద్ బిన్ యఫౌర్ అల్ ఘాఫ్లి మాట్లాడుతూ, ఓ టెలికామ్ సంస్థ నుంచి 200,000 క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నట్లుగా తమకు ఫోన్లు వచ్చాయని ఫిర్యాదులు రావడంతో విచారణ చేపట్టి నిందితుల్ని అరెస్ట్ చేశామని అన్నారు. బ్యాంక్ డిటెయిల్స్ ఇస్తే, డబ్బుని జమ చేస్తామని నిందితులు కోరుతున్నారని అధికారులు తెలిపారు. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్, అజ్మన్లో నిందితులు దాక్కున్న స్థలాన్ని గుర్తించి అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..