మెగా తనయే 'సూర్యకాంతం'
- December 18, 2018
ఒక మనసు చిత్రంతో వెండితెర ఆరంగేట్రం చేసిన మెగా హీరోయిన్ నిహారిక. ఇటీవల సుమంత్ అశ్విన్‌తో కలిసి హ్యాపీ వెడ్డింగ్ అనే చిత్రం చేసింది. ఈ మూవీకి మిక్స్‌డ్ టాక్ లభించింది. ఒరు నల్ల నాల్ పాతు సోల్రెన్ అనే టైటిల్‌తో రూపొందుతున్న తమిళ చిత్రంలోను నటించింది నిహారిక. ఇందులో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషిస్తుండగా, నిహారిక రెండు వైవిధ్యమైన పాత్రలలో కనిపించనున్నట్టు టాక్. ఇక పీరియాడికల్ చిత్రంగా రూపొందుతున్న సైరాలోను నిహారిక ఓ కీలక పాత్ర చేయనున్నట్టు సమాచారం. నూతన దర్శకుడు ప్రణీత్ బ్రమండపల్లి దర్శకత్వంలోను నిహారిక ఓ మూవీ చేస్తుంది. ఈ చిత్రంలో స్టంట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ నిహారిక కు జోడీగా నటిస్తున్నాడు. నిర్వాణ సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుండగా, తాజాగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. సూర్యకాంతం అనే టైటిల్‌తో రూపొందిన పోస్టర్ ఆకట్టుకుంటుంది. నూతన దర్శకురాలు సుజనా తెరకెక్కించనున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రంలోను నిహారిక నటిస్తుంది. ఇందులో శ్రియాతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుంది. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నిహారిక మంచి హిట్ కోసం ఎదురు చూస్తుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







