ఆగస్టు 15 విడుదలకి ఫిక్సయిన 'సాహో'
- December 18, 2018
సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'సాహో'. శ్రద్దాకపూర్ హీరోయిన్. యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. వచ్చే యేడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం.. ఆగస్టు 15కి వెళ్లిందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడీ డేటుని అధికారంగా ప్రకటించారు చిత్ర నిర్మాతలు. జెండా పండగ (ఆగస్టు 15) రోజున సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తెలిపారు.
2019లో రాబోయే భారీ సినిమా సాహో. బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తున్న సాహోపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇక, సాహో తో పాటు షూటింగ్ జరుపుకొంటున్న మరో భారీ సినిమా మెగాస్టార్ 'సైరా' విడుదల ఇంకా తేది ఇంకా ఖరారు కాలేదు. సైరా 2020 సంక్రాంతి రాబోతుందని తెలుస్తోంది.
ఇక, సాహో ఆగస్టు 15కి వెళ్లడంతో సమ్మర్ సీజన్ లో వచ్చే సినిమాలకి ఇబ్బంది తొలగినట్టయింది. మహేష్ మహర్షి సినిమా ఒకటి సమ్మర్ కే వస్తుంది. ఏప్రియల్ 5న మహర్షి విడుదల కాబోతుంది. నాని 'జెర్సీ' కూడా ఏప్రియల్ లోనే అంటున్నారు. ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. శర్వానంద్-సుధీర్ వర్మ సినిమా, విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమాలు సమ్మర్ లో వచ్చే ఛాన్స్ ఉన్నాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







