రాణిని రాయబారం చేయమంటూ మేఘన్ తండ్రి అభ్యర్ధన
- December 18, 2018
లండన్: తన కూతురు మనసు మార్చి, ఆమెను తనకు దగ్గర చేయాలని బ్రిటన్ యువరాజు హ్యారీ సతీమణి మెఘన్ మార్కెల్ తండ్రి సోమవారం ఎలిజబెత్ రాణికి విన్నవించారు. హాలీవుడ్ నటి మెఘన్ యువరాజు హ్యారీని ఈ ఏడాది మేలో వివాహం చేసుకున్నారు. అయితే అప్పట్లో పెండ్లికి ఆమె తండ్రి థామస్ మారెత్కల్ హాజరుకాలేదు. పెండ్లయ్యి బ్రిటిష్ రాజకుటుంబంలోకి ప్రవేశించిన తర్వాత మేఘన్‌కు, తనకు మధ్య అగాథం ఏర్పడిందని థామస్ వాపోయారు. ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో థామస్ మాట్లాడుతూ.. కొన్ని నెలలుగా నేను ప్రతిరోజూ నా కూతురికి ఎన్నో మెసేజ్‌లు పంపుతున్నాను. వాటికి సమాధానం రావడం లేదు. నాకోసం క్రిస్మస్ కార్డులు పంపుతుందేమోనని ఎదురుచూసినా నిరాశే మిగిలింది. దయచేసిన నా కూతురిని నాకు తిరిగి దగ్గర చేయండి. త్వరలోనే మనవరాలో, మనవడో పుట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సంతోష తరుణంలో నేను ఆమెను కలవాలనుకుంటున్నాను. మహారాణిగా మీరు దయచేసి చొరవ తీసుకోండి అంటూ ఎలిజబెత్ రాణిని అభ్యర్థించారు.
దీనిపై స్పందించేందుకు ప్యాలెస్ వర్గాలు నిరాకరించాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







