డార్లింగ్ కి తెలంగాణ దెబ్బ
- December 18, 2018
చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అనేది సినిమా డైలాగ్ మాత్రమే కాదు నిజ జీవితంలో కూడా వర్తిస్తుందని ఋజువు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇటీవల కాలం నుంచి ఆక్రమణల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్న గవర్నమెంట్ కోర్ట్ ఆదేశాలు రావడం ఆలస్యం వెంటనే అమలులో పెట్టేస్తోంది. అందులో భాగంగా చేపట్టిన చర్యల్లో ప్రభాస్ ఆస్తి ఒకటి కృష్ణార్పణం అయిపోయింది.
వివరాల్లోకి వెళ్తే రాయదుర్గంలోని పైగా ప్రాంతం 83 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో విస్తరించి ఉంది. కమర్షియల్ గా ఆ ప్రాంతం కోట్ల డిమాండ్ లో ఉంది. దాని మీద ప్రైవేట్ వ్యక్తులు ఎవరికీ హక్కులు లేవంటూ అది మా సొత్తు అంటూ తెలంగాణా ప్రభుత్వం ఎప్పటినుంచో పోరాడుతోంది. ఆశించినట్టే తీర్పు అనుకూలంగా వచ్చింది. అవన్నీ ఆక్రమణలే తేల్చి వాటిని స్వాధీనం చేసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇచ్చేసింది.
అయితే అదే ఏరియాలో ప్రభాస్ కు ఒక ఖరీదైన గెస్ట్ హౌస్ ఉంది. షూటింగ్స్ లేని సమయంలో రిలాక్స్ అవ్వడానికి అన్ని వసతులతో ప్రభాస్ దీన్ని ప్రత్యేకంగా నిర్మించుకున్నాడు. ప్రభుత్వ అధికారులు చెకింగ్ కోసం వచ్చినప్పుడు సంబంధిత వ్యక్తులు ఎవరూ లేకపోవడంతో నోటీసును గేటుకు అతికింది ఇది ప్రభుత్వ ఆస్తి అంటూ పేర్కొంటూ సీజ్ చేసి వెళ్లిపోయారు.
ప్రభాస్ తరఫున నిర్ణీత గడువు లోపు స్పందించకపోతే దానికి పూర్తిగా స్వాధీనం చేసుకుని పడగొట్టే హక్కు సంక్రమిస్తుంది. కానీ లోపల ఉన్న ఇంటీరియర్స్, విలువైన వస్తువులకు నష్టం ఏర్పడవచ్చు. మరి ప్రభాస్ దీన్ని వదిలేస్తాడా ఇంకేమైనా ఆలోచిస్తాడా చూడాలి. ఆ గెస్ట్ హౌస్ ని సరెండర్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదని న్యాయ నిపుణుల సలహా. ఆక్రమించిన ఆస్తిని కొనుగోలు చేస్తే ఇలాంటి ఇబ్బందులు తప్పవు మరి. అవి సెలెబ్రిటీలకైనా అంతే.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







