ఐఎస్‌బి మెగా ఫెయిర్‌కి అద్భుత స్పందన
- December 18, 2018
ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ (ఐఎస్‌బి) మెగా ఫెయిర్ 2018కి ఔత్సాహికుల నుంచి అద్భుత స్పందన లభిస్తోందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఇసా టౌన్‌లోని స్కూల్ క్యాంపస్‌లో ఈ మెగా ఫెయిర్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌లో ప్రధాన ఆకర్షణగా మ్యూజికల్ పెర్ఫామెన్స్‌లు నిలవనున్నాయి. ఇండియన్ ప్లే బ్యాక్ సింగర్ విదు ప్రతాప్, గాయత్రి, సంజిత్ సలామ్ ప్రదర్శనలు గురువారం, ప్రియాంక నేగి టీమ్ శుక్రవారం ప్రదర్శనలు ఇస్తారు. ఈ మెగా ఫెయిర్‌కి ఎంట్రీ ఫీజు 2 బహ్రెయినీ దినార్స్, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 1 గంటల వరకు ఈ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. టీచర్స్, స్టూడెంట్స్, పేరెంట్స్ అలాగే కమ్యూనిటీ మెంబర్స్ ఇండియన్ స్కూల్ మేనేజ్‌మెంట్‌తో కలిసి ఈవెంట్‌ని విజయవంతం చేయడానికి సంకల్పించారు. 300 మంది సభ్యులు గల ఆర్గనైజింగ్ కమిటీకి జనరల్ గవర్నర్ ఎస్ ఇనయదుల్లా నేతృత్వం వహిస్తున్నారు. స్పోర్ట్స్, టోర్నమెంట్స్, డాన్స్ అలాగే ఫొటోగ్రఫీ కాంటెస్ట్‌లు ఈ మెగా ఫెయిర్‌కి అనుబంధంగా కొనసాగిస్తున్నారు. సినిమాటిక్ డాన్స్, ఫోక్ డాన్స్‌ల్లోనూ పోటీలు నిర్వహిస్తున్నారు.బహ్రెయిన్‌లో అందరికీ ఈ పోటీల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పిస్తున్నారు. డిసెంబర్ 19 లోపు ఎంట్రీస్‌కి ఆహ్వానం వుంది. డిసెంబర్ 21న విజేతల్ని మెగా ఫెయిర్ ఫినాలెలో ప్రకటిస్తారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







