విల్లా స్విమ్మింగ్ పూల్‌లో 3 ఏళ్ళ చిన్నారి మృతి
- December 18, 2018
రస్ అల్ ఖైమః:మూడేళ్ళ చిన్నారి రస్ అల్ ఖైమాలోని ఓ హోటల్ విల్లాలోగల స్విమ్మింగ్ పూల్‌లో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబంతో కలిసి మూడేళ్ళ చిన్నారి సైఫ్ మొహమ్మద్ సయీద్ విల్లాకి వచ్చారనీ, పిల్లలంతా కలిసి ఆడుకుంటున్నారనీ, వారంతా కలిసి స్విమ్మింగ్ పూల్ వైపు వెళ్ళగా దురదృష్టవశాత్తూ చిన్నారి సైఫ్, స్విమ్మింగ్ పూల్‌లో అచేతనావస్థలో కన్పించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటన గురించిన సమాచారం అందుకోగానే రస్ అల్ ఖైమా పోలీస్, సంఘటనా స్థలానికి అంబులెన్స్ అలాగే పారామెడిక్స్‌ని అక్కడికి పంపించడం జరిగింది. ప్రాథమిక చికిత్స చేసేందుకు ప్రయత్నించిన పారామెడిక్స్‌కి చిన్నారి నుంచి స్పందన లభించకపోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడే చిన్నారి మృతి చెందిన విషయాన్ని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!