అబుధాబిలో ఇండియన్‌ మ్యాన్‌ మిస్సింగ్‌

- December 18, 2018 , by Maagulf
అబుధాబిలో   ఇండియన్‌ మ్యాన్‌ మిస్సింగ్‌

అబుధాబి:భారతదేశానికి చెందిన ఓ వ్యక్తి అబుధాబిలో మిస్సింగ్‌ అయ్యారు. కుటుంబ సభ్యులు, అతని ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. మిస్సింగ్‌ అయిన వ్యక్తిని 27 ఏళ్ళ హారిస్‌ పోమాదాత్‌గా గుర్తించారు. డిసెంబర్‌ 8న అల్‌ షమ్‌కా ప్రాంతం నుంచి ఆ వ్యక్తి తప్పిపోయినట్లు సోదరుడు సుహైల్‌ పేర్కొన్నారు. తన సోదరుడు ఓ రెస్టారెంట్‌లో ఏడాదిగా డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు సొహెయిల్‌ తెలిపారు. తనను కలిసేందుకు అల్‌ సమ్‌కా వస్తున్నట్లు డిసెంబర్‌ 8న తన సోదరుడు చెప్పారనీ, అవే అతని చివరి మాటలని సుహైల్‌ తెలిపారు. పోలీసులకు ఈ విషయమై ఫిర్యాదు కూడా చేశారు. ఇండియన్‌ ఎంబసీకి కూడా తన సోదరుడి మిస్సింగ్‌పై ఫిర్యాదు చేశామనీ, తమ సోదరుడి ఆచూకీ లభిస్తుందనే నమ్మకం వుందని సుహైల్‌ అంటున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com