విల్లా స్విమ్మింగ్ పూల్‌లో 3 ఏళ్ళ చిన్నారి మృతి
- December 18, 2018రస్ అల్ ఖైమః:మూడేళ్ళ చిన్నారి రస్ అల్ ఖైమాలోని ఓ హోటల్ విల్లాలోగల స్విమ్మింగ్ పూల్‌లో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబంతో కలిసి మూడేళ్ళ చిన్నారి సైఫ్ మొహమ్మద్ సయీద్ విల్లాకి వచ్చారనీ, పిల్లలంతా కలిసి ఆడుకుంటున్నారనీ, వారంతా కలిసి స్విమ్మింగ్ పూల్ వైపు వెళ్ళగా దురదృష్టవశాత్తూ చిన్నారి సైఫ్, స్విమ్మింగ్ పూల్‌లో అచేతనావస్థలో కన్పించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటన గురించిన సమాచారం అందుకోగానే రస్ అల్ ఖైమా పోలీస్, సంఘటనా స్థలానికి అంబులెన్స్ అలాగే పారామెడిక్స్‌ని అక్కడికి పంపించడం జరిగింది. ప్రాథమిక చికిత్స చేసేందుకు ప్రయత్నించిన పారామెడిక్స్కి చిన్నారి నుంచి స్పందన లభించకపోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడే చిన్నారి మృతి చెందిన విషయాన్ని వెల్లడించారు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్