దోహా:లుసైల్ స్టేడియం డిజైన్ విడుదల
- December 18, 2018
దోహా(ఖతార్): ఫిఫా ప్రపంచకప్ (2022) నిర్వహణ అవకాశాన్ని దక్కించుకున్న ఖతార్ .. ప్రారంభ వేడుకలు నిర్వహించే స్టేడియం డిజైన్‌ను ఆవిష్కరించింది. మధ్యప్రాచ్యంలో మొదటిసారిగా జరిగే ఫిఫా ఫైనల్ కోసం ఖతార్ దేశాధినేత షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని సహా ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సహా పలువురు ప్రతినిధులు హాజరుకానున్నారని ప్రపంచకప్ ఉన్నతస్థాయి కమిటీ తెలిపింది. లుసైల్ స్టేడియం సామర్థ్యం 80 వేలు కాగా.. అరబ్ నిర్మాణ శైలిలో స్టేడియం ఆకృతిని బ్రిటన్‌కు చెందిన పోస్టర్-పాట్నర్స్ సంస్థ రూపొందించింది. 4500 కోట్లతో ఖతార్ రాజధాని దోహాకు ఉత్తరంగా 15 కిలోమీటర్ల దూరంలో ఈ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. 2020 ఏడాదికి ఈ స్టేడియం నిర్మాణం పూర్తి కానుంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును మైలురాయిగా ఖతార్ ప్రపంచకప్ నిర్వహించే ఉన్నతస్థాయి కమిటీకి నేతృత్వం వహిస్తున్న హసన్ అల్ అభివర్ణించారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్