ఎమర్జన్సీ కాల్ సెంటర్ స్టాఫ్‌ని దూషించిన వ్యక్తి అరెస్ట్
- December 18, 2018షార్జా పోలీస్ ఎమర్జన్సీ కాల్ సెంటర్ 911 ఉద్యోగిని దూషించిన నేరానికిగాను ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడ్ని న్యాయస్థానం యెదుట హాజరుపరిచారు. స్పెషల్ నీడ్స్ వ్యక్తి డ్రైవ్ చేసే వాహనానికి సంబంధించి పార్కింగ్ స్పేస్ కోసం నిందితుడు, కాల్ సెంటర్‌కి ఫోన్ చేశాడని విచారణలో తేలింది. స్పెషల్ నీడ్ పర్సన్‌కి సాయం చేసేందుకు తాను ఆ పని చేశాననీ, ఈ క్రమంలో తాను అదుపు కోల్పోయిన మాట వాస్తవమని విచారణలో నిందితుడు అంగీకరించాడు. కుటుంబ సమస్యల వల్ల తాను తన మాట మీద అదుపు కోల్పోవడం జరిగిందని, జరిగిన ఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్నాడు నిందితుడు. ఈ కేసు విచారణని న్యాయస్థానం డిసెంబర్ 30వ తేదీకి వాయిదా వేసింది. నిందితుడికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. బాధితురాలి వెర్షన్‌ని న్యాయస్థానం విననుంది.
తాజా వార్తలు
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!