హైదరాబాద్:మెట్రో, ఆర్టీసీ, ఎంఎంటీఎస్‌కు ఒకే కార్డు...
- December 18, 2018
హైదరాబాద్ జంట నగరాల వాసులకు ఇది ముమ్మాటికీ శుభవార్తే... త్వరలోనే మెట్రో రైల్, ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణించాలంటే ఒక కార్డు తీసుకుంటే సరిపోతుంది. 'మెట్రో కామన్ మోబిలిటీ కార్డ్' పేరుతో ఇది త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనిపై వారం రోజుల్లో విధివిధానాలు ఖరారు చేయనున్నారు. టీఆర్ అండ్ బీ ప్రధాన కార్యదర్శి సుశీల్ శర్మ, హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి... బేగంపేట్‌లోని హెచ్ఎంఆర్ఎల్ కార్యాలయంలో కామన్ మోబిలిటీ కార్డ్ అమలుపై సమీక్షించారు. ఎస్బీఐ/ హిటాచీ కన్సార్టియం ద్వారా సీఎంసీ అండ్ టీ మెట్రో సీఎంసీ కార్డును అమలు చేయడానికి హోదాను ఇచ్చారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి, 2019 జనవరి చివరికి కనీసం రెండు మెట్రో స్టేషన్లలో, 100 ఆర్టీసీ బస్సుల్లో, 50 ఆటోస్ మెట్రో క్యాంపెన్షన్ ప్రాంతాల ద్వారా పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని సూచించారు. ఈ ప్రాజెక్టు పురోగతిని ప్రిన్సిపాల్ సెక్రటరీ టీఆర్ అండ్ బీ, ఎంఎండీ, హెచ్ఎమ్ఆర్ఎల్ పర్యవేక్షిస్తారు. ఇది సక్సెస్ అయితే... జంట నగరాల పరిధిలో త్వరలోనే 'మెట్రో కామన్ మోబిలిటీ కార్డ్' అందుబాటులోకి రానుంది.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..