సీఎం కుమార్ స్వామి ఇంట్లో బాంబ్: అప్రమత్తమైన పోలీసు బలగాలు
- December 19, 2018
కర్ణాటక: కన్నడ పోలీసులను ఓ ఫోన్ కాల్ పరుగులు పెట్టించింది. సీఎం కుమారస్వామి ఇంట్లో బాంబు పెట్టారని..ఆ బాంబ్ కొద్ది సమయంలోనే పేలనుందని పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పోలీస్ అధికారులు ఆగమేఘాలమీద ఉరుకులు పరుగులు పెట్టారు. ఫోన్ కాల్ పై అప్రమత్తమై బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో వెళ్లిన పోలీసులు, తనిఖీల అనంతరం అదో ఫేక్ కాల్ అని తేల్చారు. ఆపై ఫోన్ నంబర్ ఆధారంగా విచారణ చేపట్టిన జేపీ నగర్ పోలీసులు, మన్సూర్ అనే యువకుడిని అరెస్ట్ చేశారు. పోలీసులను తప్పుదారి పట్టించేందుకు అతను గోపాల్ గా మార్చి చెప్పాడని పోలీస్ విచారణలో వెల్లడయ్యింది. కాగా ఎందుకు ఫోన్ చేశాడనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కాగా ఇటువంటి ఫేక్ కాల్స్ చేయటం ఆకతాయిలకు కామన్ గా మారిపోయింది. ఇటువంటి ఘటనలు గతంలో పలు సందర్భాలలో జరిగిన విషయం తెలిసిందే. గుర్తింపు కోసమో లేక ఆటపట్టిద్దామనో ఆకతాయిలు ఇటువంటి ఫేక్ కాల్స్ చేస్తుంటారు. కానీ అదే నిజమైతే..ఫేక్ అని పోలీసులు భావిస్తే..నష్టం మాత్రం భారీగా వుండొచ్చు. కాబట్టి ఫేక్ కాల్స్ తో తప్పుదారి పట్టించటం సరికాదనే విషయం తెలుసుకోవాల్సిన అవసరముందని గుర్తించాలి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..