5 రోజుల మెగా సేల్ నేడే ప్రారంభం
- December 19, 2018
క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల కోసం షాపింగ్‌కి సిద్ధమవుతున్నారా? అయితే దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ వరకూ ఎదురు చూడాల్సిన పనిలేదు. ఐదు రోజులపాటు సాగే మెగా సేల్‌లో మీ షాపింగ్ అవసరాల్ని తీర్చేసుకోవచ్చు. డిసెంబర& 19 నుంచి డిసెంబర్ 23 వరకు భారీ డిస్కౌంట్లతో ఐదు రోజులపాటు ఈ సేల్ అందుబాటులో వుంటుంది. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో షాపింగ్ ప్రియులకు ఈ మేరకు సేల్ ఆహ్వానం పలుకుతోంది. హాల్ నెంబర్స్ 7, 8 లలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు టాప్ బ్రాండ్స్ భారీ డిస్కౌంట్లతో అందుబాటులో వుంటాయి. ప్రిమాడోనా, బౌర్జోయిస్, డీజిల్, బబాస్, టెడ్ బెకర్, గెస్, బాల్ది, స్కెచర్స్ వంటి బ్రాండ్స్ ఇక్కడ లభ్యమవుతాయి. ఈ మెగా సేల్‌ని అందాల భామ సన్నీలియోన్ ప్రారంభించనుంది. వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఉదయం 9.45 నిమిషాలకు ఈ కార్నివాల్ బిగ్ బ్రాండ్స్ కార్నివాల్ ప్రారంభం కానుంది. ప్రతి ఒక్కరికీ ఈ సేల్‌లో ఉచిత ప్రవేశం వుంటుంది.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







