ఆధార్.. అడిగితే భారీ ఫైన్, జైలు
- December 19, 2018
ఆధార్.. పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు అన్ని అవసరాలకు లింక్ చేసి మనిషికి నిత్యావసరంగా ప్రభుత్వాలు మార్చేశాయి. కానీ ఇది వ్యక్తి స్వేచ్ఛను హరించే గుర్తింపు కార్డు కావడంతో సుప్రీం కోర్టు ఆధార్‌ను వివిధ పనులకు ఖచ్చితంగా ప్రామాణికంగా తీసుకోరాదని తీర్పునిచ్చింది. తాజాగా టెలికాం కంపెనీలు, బ్యాంకులకు కేంద్రం వార్నింగ్ ఇచ్చింది.
లబ్ధిదారులు ఎవరైనా మొబైల్ కనెక్షన్ కోసం గానీ. బ్యాంకు ఖాతా తెరవడం కోసం కానీ టెలికాం, బ్యాంకు సంస్థలు ఆధార్ ను ఖచ్చితంగా కావాలని అడిగితే శిక్షార్హం అయ్యేలా కేంద్ర కేబినెట్ ఆర్డర్ తీసుకురాబోతోంది. కేంద్ర కేబినెట్ ఈ మేరకు అమెండ్ మెంట్ ను తీసుకొచ్చింది. బ్యాంకులు, మొబైల్ సంస్థలు ఆధార్ ను తప్పనిసరి చేయవద్దని సూచించింది. అదే సమయంలో వ్యక్తి గుర్తింపు కోసం పాస్ పోర్టు లేదా రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవచ్చని సూచించింది. ఒకవేళ ఆ సిబ్బంది ఎవరైనా ఆధార్ తప్పనిసరి అని కోరితే కోటి రూపాయల వరకు జరిమానా మరియు జైలు శిక్ష కూడా పడుతుందని కేంద్రం అమెండ్ మెంట్ లో పేర్కొంది.
ఇక నుంచి ఆధార్ లబ్ధిదారులు కూడా ప్రతి కేవైసీ కోసం ఆధార్ ను ఇవ్వనవసరం లేదని కేంద్రం స్పష్టం చేస్తోంది. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ తోపాటు పీఎంఎల్ అనుసరించి సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఆధార్ ను పింఛన్, ప్రభుత్వ నిధులు పొందేందుకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు తప్పనిసరి చేయడాన్ని ఉపసంహరించారు.
ఈ అమెండ్ మెంట్ ను త్వరలోనే పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదం పొందేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. అయితే ఇందులో రాష్ట్రాల ఇష్టాయిష్టాలను బట్టి ఆధార్ ను ఉపయోగించుకోవచ్చని కూడా వెసులుబాటును కల్పిస్తోంది.
ఆధార్ బయోమెట్రిక్ కావడంతో వ్యక్తి సమాచారం మొత్తం నిక్షిప్తమై ఉంటోంది. దీన్ని కొన్ని సంస్థలు దుర్వినియోగం చేస్తున్నాయి. ఈ డేటాను తీసుకొని అక్రమాలకు పాల్పడుతున్నాయి. ఇప్పటికే డేటా దుర్వినియోగం అయితే 50 లక్షల ఫైన్ తోపాటు 10 లక్షల జరిమానాను కేంద్రం విధించేలా కఠిన నిబంధనలు రూపొందించింది. కొన్ని టెలికాం సంస్థలు తమ వద్దకు వచ్చిన వ్యక్తుల ఆధార్ ఐడీలను వాణిజ్య అవసరాలకు వినియోగించుకుంటున్నట్టు తేలింది. ఆధార్ ను లబ్ధిదారుల నుంచి సేకరించే సమయంలోనే కొంతమంది ఉద్యోగులు పక్కదారి పట్టిస్తున్నట్టు తేలింది. ఆధార్ కాపీలను 10వేల నుంచి లక్ష వరకు కూడా అమ్ముకున్నట్టు గుర్తించారు. అందుకే ఇక నుంచి ఆధార్ అడిగితే కోటి వరకు జరిమానా, జైలు శిక్షను విధిస్తామని కేంద్రం సవరణను తీసుకురాబోతోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!