రియాద్‌లో కొరియన్ ఎగ్జిబిషన్ ప్రారంభం
- December 19, 2018
రియాద్: సౌదీ కమిషన్ ఫర్ టూరిజం అండ్ నేషనల్ హెరిటేజ్ ప్రెసిడెంట్ ప్రిన్స్ సుల్తాన్ బిన్ సల్మాన్, రియాద్‌లో కొరియన్ హిస్టరీ అండ్ కల్చర్‌ని ప్రదర్శించేందుకు ఏర్పాటైన ఎగ్జిబిషన్‌ని ప్రారంభించారు. కొరియాలోని సియోల్ నేషనల్ మ్యూజియమ్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ బీ కిడోంగ్, సౌదీ అరేబియాలో కొరియన్ అంబాసిడర్ బ్యుంగ్ వూక్తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రిన్స్ సుల్తాన్ బిన్ సల్మాన్. %కొరియన్ హిస్టరీ అండ్ కల్చర్ - ఎన్‌ఛాంటింగ్ జర్నీ టు ది కొరియన్ సివిలైజేషన్' పేరుతో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటయ్యింది. మార్చి 7 వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. సౌదీ అరేబియాలో ఈ తరహా ఎగ్జిబిషన్ ఇదే తొలిసారి. ప్రిన్స్ సుల్తాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కల్చర్, ఆర్కియాలజీ విభాగాల్లో ఈ తరహా స్నేహ సంబంధాలు ఎంతో ముఖ్యమని అభిప్రాయపడ్డారు. కొరియా ప్రజలు, ప్రభుత్వం తరఫున ప్రొఫెసర్ బీ, కింగ్డమ్కి కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..