ఆమ్మో..5 రోజులు బ్యాంకులు బంద్‌

- December 20, 2018 , by Maagulf
ఆమ్మో..5 రోజులు బ్యాంకులు బంద్‌

బ్యాంకులు వరుసగా 5 రోజులు మూసివేయబడనున్నాయి. ఈ నెల 21 నుంచి 26 వరకూ బ్యాంకులు తెరుచుకునే అవకాశం లేదు. బ్యాంకు యూనియన్లు ఈ నెల 21 న (రేపు) శుక్రవారం బంద్‌ కు పిలుపునిచ్చాయి. స్కేల్‌ ఐవి లో ఉన్న అధికారుల జీతాల పెంపు కోసం ఈ బంద్‌ తలపెట్టామని బ్యాంకు యూనియన్లు పేర్కొన్నాయి. డిసెంబర్‌ 26 న భారతదేశం అంతటా బ్యాంక్‌ ఫోర్స్‌ ద్వారా మరొక సమ్మె కాల్‌ ఉందని తెలిపాయి. డిసెంబర్‌ 21 న సమ్మె, 22 న నాలుగో శనివారం, 23 ఆదివారం, 25 క్రిస్మస్‌ సెలవు, 26 న మరో సమ్మె కాల్‌ కు పిలుపునిచ్చామని చెప్పాయి. ఇలా.. వరసగా ఐదు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com