కుంభమేళాకు విచ్చేసే విదేశీ భక్తులకు టెంట్ హోటల్స్
- December 20, 2018
ప్రయాగ్‌రాజ్: ప్రయాగ్‌రాజ్ నగరంలో జరగబోయే కుంభమేళాకు వచ్చే విదేశీ భక్తులకు టెంట్ హోటల్స్‌ను ఏర్పాటు చేశారు. ఫైవ్‌స్టార్ రేంజ్‌లో భక్తులకు టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే భక్తులు ఈ లగ్జరీ టెంట్లలో బస చేసేందుకు వీలుగా ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవాలని ప్రయాగ్‌రాజ్ నగర కమీషనర్ ఆశిష్ గోయల్ చెప్పారు. కుంభమేళాకు దాదాపు 25 లక్షల మంది విదేశీ భక్తులు రానుండడంతో వారికి సౌకర్యాలు కల్పించేందుకు పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంలో ఈ టెంట్లను నిర్మించారు. ఈ టెంట్లలో వైఫై, లగ్జరీ టాయిలెట్లు, టివి సెట్లు, డబుల్ బెడ్‌రూం సౌకర్యాలు కలవు. కుంభమేళా సందర్భంగా రైల్వేశాఖ ప్రత్యేకంగా అలంకరించిన రైళ్లను నడపనుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







