ఎయిర్‌పోర్ట్‌లో డ్రోన్లు సృష్టించిన గందరగోళం

- December 20, 2018 , by Maagulf
ఎయిర్‌పోర్ట్‌లో డ్రోన్లు సృష్టించిన గందరగోళం

లండన్: ఆకస్మికంగా కనిపించిన డ్రోన్లతో ఓ ఎయిర్‌పోర్ట్‌లో విమానాలకు అంతరాయం ఏర్పడింది. బ్రిటన్‌లోని గాట్విక్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. బుధవారం ఆ విమానాశ్రయ ఎయిర్‌ఫీల్డ్‌లో రెండు డ్రోన్లు కనిపించాయి. దీంతో కొన్ని విమానాలను రద్దు చేశారు. రన్‌వేను మూసివేశారు. ఇవాళ కూడా మరికొన్ని డ్రోన్లు .. గాట్విక్ ఎయిర్‌ఫీల్డ్‌లో కనిపించాయి. దీంతో ఆందోళన చెందిన విమానాశ్రయ అధికారులు.. రన్‌వేను మూసివేశారు. ప్రస్తుతం ల్యాండింగ్ కానీ, టేకాఫ్‌ కానీ జరగడం లేదు. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో సుమారు లక్షన్నర మంది ప్యాసింజెర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎయిర్‌ఫీల్డ్‌లో డ్రోన్ల కనిపించడంతో.. పోలీసులు వాటి కోసం అన్వేషిస్తున్నారు. ఎక్కడ నుంచి వాటిని ఆపరేట్ చేస్తున్నారో కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. విమానాశ్రయ ఎయిర్‌ఫీల్డ్‌లో ఎగురుతున్న డ్రోన్లను కూల్చేందుకు అధికారులు భయపడుతున్నారు. బుల్లెట్లు పేలిస్తే మరింత ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇవాళ రన్‌వేను పూర్తిగా మూసివేసే అవకాశాలు ఉన్నట్లు ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్ పేర్కొన్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com