ఎయిర్‌పోర్ట్‌లో డ్రోన్లు సృష్టించిన గందరగోళం
- December 20, 2018
లండన్: ఆకస్మికంగా కనిపించిన డ్రోన్లతో ఓ ఎయిర్‌పోర్ట్‌లో విమానాలకు అంతరాయం ఏర్పడింది. బ్రిటన్‌లోని గాట్విక్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. బుధవారం ఆ విమానాశ్రయ ఎయిర్‌ఫీల్డ్‌లో రెండు డ్రోన్లు కనిపించాయి. దీంతో కొన్ని విమానాలను రద్దు చేశారు. రన్‌వేను మూసివేశారు. ఇవాళ కూడా మరికొన్ని డ్రోన్లు .. గాట్విక్ ఎయిర్‌ఫీల్డ్‌లో కనిపించాయి. దీంతో ఆందోళన చెందిన విమానాశ్రయ అధికారులు.. రన్‌వేను మూసివేశారు. ప్రస్తుతం ల్యాండింగ్ కానీ, టేకాఫ్ కానీ జరగడం లేదు. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో సుమారు లక్షన్నర మంది ప్యాసింజెర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎయిర్‌ఫీల్డ్‌లో డ్రోన్ల కనిపించడంతో.. పోలీసులు వాటి కోసం అన్వేషిస్తున్నారు. ఎక్కడ నుంచి వాటిని ఆపరేట్ చేస్తున్నారో కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. విమానాశ్రయ ఎయిర్‌ఫీల్డ్‌లో ఎగురుతున్న డ్రోన్లను కూల్చేందుకు అధికారులు భయపడుతున్నారు. బుల్లెట్లు పేలిస్తే మరింత ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇవాళ రన్‌వేను పూర్తిగా మూసివేసే అవకాశాలు ఉన్నట్లు ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్ పేర్కొన్నది.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు