పుచ్చకాయలో ఎన్నో ఔషధ గుణాలు దాగివున్నాయి.ఇందులో 92 శాతం నీరే. పుచ్చకాయలో కొలెస్ట్రాల్ ఉండదు.విటమిన్ - ఎ, బి6, సి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి.పీచుపదార్థం, పొటాషియం అధిక మొత్తాల్లో ఉంటాయి. పుచ్చకాయతో జూస్ వీటివల్ల ఆందోళన, చికాకు తగ్గి, వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్లు దాడి చేయకుండా ఉంటాయి.పొటాషియం శరీరంలో ఉండే నీటి మొత్తాలను అదుపు చేస్తుంది.పుచ్చకాయలో ఎరుపు రంగుకు కారణమైన లైకో పీన్ కెరటినాయిడ్ క్యాన్సర్లు, గుండెజబ్బులు, కంటి లోపల పొర క్షీణించడం వంటి వాటిని రాకుండా నిరోధిస్తుంది. పుచ్చకాయలో అధిక మొత్తాల్లో ఉండే పొటాషియం మూత్రవ్యవస్థను సాఫీగా సాగేలా చేస్తుంది. ఎండాకాలంలో ఉక్కపోత వల్ల స్వేదంతో పాటు శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు కూడా వెలువడి విపరీతమైన దప్పిక పుడుతుంది.దీనిని పుచ్చకాయతో తీర్చుకోవచ్చు.కామెర్లు, పైత్యపు వికారాలు, తలనొప్పి, నోరు తడారిపోవటం, ఇన్ఫెక్షన్లు వంటివి ఇబ్బంది పెడుతున్నప్పుడు పుచ్చకాయ రసానికి సమాన భాగం మజ్జిగ కలిపి తగినంత ఉప్పు చేర్చి తీసుకోవాలి. వేసవి తాపాన్ని తగ్గించే పుచ్చకాయ (తర్భూజా)లో ఉండే లైకోపీన్ అనే పదార్థం పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తిని పెంచుతుందని తాజా పరిశోధనల ద్వారా తెలుస్తోంది.అంతేగాకుండా ఈ లైకోపీన్ వీర్యకణాలు ఎక్కువసేపు సజీవంగా ఉండేలా కూడా చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తి సంఖ్యాపరంగా చూస్తే శీతాకాలంలో ఎక్కువగా ఉంటుందనీ, వేసవిలో తక్కువగా ఉంటుందనేది చాలా మందికి తెలిసిన విషయం.అయితే ఈ కాలంలో దాంపత్య కార్యకలాపాలలో పాల్గొన్నప్పటికీ పిల్లలు పుట్టని దంపతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, మహిళలు తమ భాగస్వామిని ఎక్కువగా పుచ్చకాయ తినేలా చేస్తే సరిపోతుందని పరిశోధకులు సూచిస్తున్నారు. మామూలుగా పుచ్చకాయలో 92 శాతం నీళ్లే ఉంటాయి.అందులోని 8 శాతం లైకోపీన్ మాత్రం వీర్యవృద్ధిని పెంచటమేగాకుండా ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో సులక్షణాలను కలిగి ఉంది.లైకోపీన్ అనబడే ఈ ఫైటో కెమికల్ గుండె, ప్రొస్టేట్, చర్మ సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.అలాగే ఓవరియన్, సర్వికల్, నోటి సంబంధిత క్యాన్సర్లనుంచి కూడా రక్షణనిస్తుంది.ఇంకా పుచ్చకాయ వేసవినుంచి చర్మాన్ని కాపాడుతుంది.కాలిన గాయాలమీద చల్లని పుచ్చకాయ ముక్కల్ని ఉంచితే ఉపశమనం కలుగుతుంది.
వేసవిలో పుచ్చకాయ
- May 11, 2015
తాజా వార్తలు
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..









