త్వరలో రజనీకాంత్ టీవీ ఛానెల్ ప్రారంభం
- December 21, 2018
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాల కన్నా ఆయన పొలిటికల్ ఎంట్రీపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. జయలలిత మరణం తర్వాత కోలీవుడ్ స్టార్ హీరోలు కమల్ హాసన్, రజనీకాంత్ తమిళ రాజకీయాలలో కీలకంగా మారనున్నారనే వార్తలు వచ్చాయి. ఇప్పటికే కమల్ తన పార్టీ పేరు ఎజెండా ప్రకటించగా, రజనీకాంత్ తన పార్టీకి 'మక్కల్ మంద్రమ్' అనే పేరుని పెట్టారు. వచ్చే ఎన్నికల్లో 234 స్థానాల్లో తమ పార్టీ తరుపున అభ్యర్థులు బరిలో నిలుస్తున్నట్లు గత ఏడాది డిసెంబర్ 31న ప్రకటించాడు రజనీ. పార్టీ నిర్మాణం రూపొందించే పూర్తి బాధ్యతని లైకా ప్రొడక్షన్స్ మాజీ అధినేత రాజు మహలింగం మరియు అభిమానుల సంఘం నాయకుడు సుధాకర్‌కి రజనీకాంత్ అప్పగించినట్టు తెలుస్తుంది. అయితే రజనీకాంత్ పేరుతో ఓ టీవీ ఛానెల్ ప్రారంభం కాబోతుందనే విషయాన్ని రజనీ మక్కల్ మంద్రమ్ కన్వీనర్ వీఎం సుధాకర్ తెలిపారు. సూపర్ స్టార్ టీవీ, రజినీ టీవీ, తలైవర్ టీవీ ఇలా మూడు పేర్లతో ట్రేడ్‌మార్కర్లని నమోదు చేసే ప్రక్రియ ప్రారంభించామని సుధాకర్ అన్నారు. రజనీ పేరు, లోగోలో ఆయన ఫోటో పెట్టడంపై రజనీకాంత్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. త్వరలోనే ఈ ఛానెల్‌కి సంబంధించిన అన్ని వివరాలు తెలియజేస్తాం అని సుధాకర్ స్పష్టం చేశారు. రజనీకాంత్ నటించిన పేటా సంక్రాంతికి రానుండగా,ఆ తర్వాత మురుగదాస్‌తో తన 166వ సినిమా చేయనున్నాడు మన సూపర్ స్టార్.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







