ప్రేమ కథా చిత్రమ్ 2 టీజర్ రిలీజ్
- December 21, 2018హరర్ అండ్ లవ్ కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కిన థ్రిల్లర్ చిత్రం ప్రేమకథా చిత్రమ్. 2013 మే 11న విడుదలైన ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆర్ పి ఏ క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 3గా ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మాతగా 'ప్రేమ కథా చిత్రం 2' సినిమాని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి 'బ్యాక్ టూ ఫియర్' అనేది క్యాప్షన్. ఈ చిత్రంతో హరి కిషన్ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నందిత శ్వేత కథానాయికగా నటిస్తుంది. కామెడీ ఎంటర్టైనర్గా అన్ని వర్గాల్ని ఎంటర్ టైన్ చేసే కథగా ప్రేమ కథా చిత్రం2 రూపొందుతుందని నిర్మాతలు చెబుతున్నారు. తాజాగా చిత్ర టీజర్ రిలీజ్ చేశారు. ఇందులోని సన్నివేశాలు భయపెట్టేవిగా ఉన్నాయి. తొలి పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ మరింత భయపెట్టిస్తుందని అంటున్నారు. టీజర్లో లవ్ .. రొమాన్స్ ..హారర్ సన్నివేశాలు ఉన్నాయి. నందిత దెయ్యంగా కనిపిస్తూ అలరించింది. సీనియర్ కెమెరామెన్ సి.రాం ప్రసాద్, ఎడిటర్ ఉద్ధవ్, సంగీతం జెబి, డైలాగ్ రైటర్ చంద్ర శేఖర్ లాంటి టెక్నీషియన్స్ మెయిన్ పిల్లర్స్‌గా ఈ సినిమాకి పని చేస్తున్నారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందిస్తున్నారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్