'దటీజ్ మహాలక్ష్మి' టీజర్ విడుదల.!
- December 21, 2018కొంతకాలం క్రితం హిందీలో కంగనా రనౌత్ చేసిన చేసిన 'క్వీన్' మూవీ ఘన విజయాన్ని అందుకుంది. దాంతో సౌత్ లోని ఇతర భాషల్లోను ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. తెలుగు రీమేక్ కి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. తమన్నా ప్రధాన పాత్రధారిగా చేస్తోన్న ఈ సినిమాకి 'దటీజ్ మహాలక్ష్మి'అనే టైటిల్ ను ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. రాజమండ్రి దగ్గరలోని ఓ మారుమూల గ్రామం నుంచి ఫ్రాన్స్ వెళ్లిన మహాలక్ష్మికి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. మహాలక్ష్మి అమాయకత్వం .. రాజమండ్రిపై ఆమెకి గల ప్రేమ .. విదేశీ సంస్కృతిలో ఇమడటానికి ఆమె పడిన ఇబ్బందులనే ఈ టీజర్ లో చూపించారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ