ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ విడుదల..
- December 21, 2018
టాలీవుడ్ నటుడు బాలకృష్ణ ప్రధాన పాత్రలో నందమూరి తారకరామారావు బయోపిక్ రెండు పార్టులుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలుగా ప్రేక్షకుల ముందుకురానుంది. క్రిష్ దర్వకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. 'నేను ఉద్యోగం మానేశాను..ఎందుకు మానేశావు..నచ్చలేదు..మరేం చేద్దామని..సినిమాల్లోకి వెళతాను..నిన్ను చూడటానికి జనాలు టికెట్లు కొనుక్కొని థియేటర్లకు వస్తున్నారు..ఇలా నువ్వే వెళ్లి కనిపిస్తే నీ సినిమాలు ఎవరు చూస్తారు..జనం కోసమే సినిమా అనుకున్నాను..ఆ జనానికే అడ్డమైతే సినిమా కూడా వద్దంటాను' అంటూ వచ్చే డైలాగ్స్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉన్నాయి. ఓ వైపు సినిమాలు..మరో వైపు రాజకీయ ప్రస్తానం రెండింటిని చూపిస్తూ రూపొందించిన ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్‌ను రెండు పార్టులుగా విడుదల కానుంది. మొదటి భాగం 'కథానాయకుడు' చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయనుండగా..'మహానాయకుడు' సినిమా రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24న విడుదల కానుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







