బ్రాడ్ బ్యాండ్ కమ్యునికేషన్ శాటిలైట్ సక్సెస్
- December 22, 2018హోంగ్యున్ ప్రాజెక్ట్ లో భాగంగా చైనా బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించే సామర్థ్యం ఉన్న కమ్యూనికేషన్ శాటిలైట్‌ను విజయవంతగా ప్రయోగించింది. ఈ శాటిలైట్ కు ఆర్కిటిక్ నుంచి అంటార్కిటికా వరకు.. భూమి మొత్తం బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించే సామర్థ్యం కలిగి ఉంది. ఈ శాటిలైట్ ను నార్త్ వెస్ట్ చైనా లోని జిక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి లాంగ్ మార్చ్-11 రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించారు. ఇది విజయవంతగా కక్ష్యలోకి ప్రవేశించింది. గూగుల్‌తో పాటు ఇతర అంతర్జాతీయ ఇంటర్నెట్ సంస్థలకు.. ఈ శాటిలైట్ సరికొత్త సవాల్‌ను విసరనున్నది. ఈ శాటిలైట్‌తో ప్రపంచవ్యాప్తంగా బ్రాడ్ బ్యాండ్ సేవలు అందుబాటులోకి వస్తాయి. అంతరిక్ష ఆధారిత కమ్యూనికేషన్ నెట్వర్క్ కోసం గత రెండేళ్లుగా హూంగ్యున్ ప్రాజెక్టుపై చైనా పనిచేస్తున్నది. ఉపగ్రహం బరువు 247 కిలోలు. ఇది భూమికి 1100 కిలోమీటర్ల ఎత్తులో భ్రమిస్తుంది. కనీసం ఏడాది పాటు పనిచేసే విధంగా దీన్ని రూపొందించారు. అయితే అధిక సంఖ్యలో హూంగ్యున్ ఉపగ్రహాలను తయారు చేసేందుకు చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ సంస్థ పనిచేస్తున్నది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్