రెండు లక్షల మందితో ఏపీలో మోదీ సభ

- December 22, 2018 , by Maagulf
రెండు లక్షల మందితో ఏపీలో మోదీ సభ

2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ సిద్దమవుతోంది. నాలుగేళ్లలో కేంద్రం సాధించాన విజయాలను వివరిస్తూ పార్టీని బలోపేతం చేయాలన నిర్ణయించారు. ప్రధానమంత్రి మోడీ సభలకుఏర్పాట్లు చేస్తున్నారు. గుంటూరుతో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర లలో సభలు నిర్వహించే యోచనలో ఆ పార్టీ నేతలు ఉన్నారు.

ఇప్పటికే గుంటూరు సభకు మోడీ రాక ఖాయమైంది. దీంతో సభకు కృష్ణా, ప్రకాశం జిల్లాల నుండి సైతం భారీగా జనసమీకరణ చేయాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రెండు లక్షల మందితో నిర్వహిస్తామంటున్నారు. మోదీ బహిరంగ సభతో ఏపీలో రాజకీయాలు మారిపోతాయని బీజేపీశ్రేణులు భావిస్తున్నాయి. అమరావతి శంకుస్థాపనకు నరేంద్రమోదీ మట్టి, నీళ్ళు తీసుకువచ్చారు.ఆ తరువాత ఇప్పటి వరకు ఏపీలో అడుగుపెట్టలేదు. దాదాపు నాలుగు సంవత్సరాల తరువాత ప్రధాని వస్తుండడంతో ఏపీకి వరాలు కురిపిస్తారని నమ్ముతున్నారు. మోదీ సభతో ఆంద్రప్రదేశ్ లో బీజేపీ పార్టీ మరింత బలపడుతుందని కేడర్ నమ్ముతోంది.

అయితే మోదీ రాకతో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పార్టీ మరింత బలపడుతుందని నేతలు భావిస్తున్నారు. కానీ తెలంగాణ ఫలితాల చూసిన తర్వాత ఆశలు నీరుగారిపోతున్నాయి. పార్టీకి కొద్ధో గోప్పో బలం ఉన్న తెలంగాణలోనే కేవలం ఒక్క సీటుకు పరిమితమైంది. ఏపీలో ఒంటరిగా నే పోటీ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన కూడా ఉంది. అయితే నేతలు మాత్రం ఇందుకు ధీమాగా ఉన్నారు.

మరోవైపు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే మోదీ ఏపీ రావాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. విభజన హామీలు అమలు చేయకుండా.. ప్రత్యేక హోదా., రైల్వే జోన్ గురించి తేల్చకుండా ఏ ముఖంతో రాష్ట్రానికి వస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అటు కాంగ్రెస్ నేతలు సైతం మోడీ టూరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తం మీద ప్రధాని మోదీ టూరు ప్రకటనతో ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలు సైతం ఒకరిపైఒకరు మాటల తూటాలు పేల్చుకోవడానికి వేదికగా మారింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com