శబరిమలలో మళ్లీ టెన్షన్.. టెన్షన్
- December 23, 2018

శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి వెళ్లేందుకు 11 మంది మహిళలు పంబ వద్దకు చేరుకున్నారన్న సమాచారంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పలువురు భక్తులు వీరిని పంబ వద్దే అడ్డుకున్నారు. ఆలయంలోకి వీరిని వెళ్లనివ్వబోమని స్పష్టం చేశారు. మదురై రోడ్డు మార్గం గుండా ఈ మహిళలు పంబకు చేరుకున్నారు. తెల్లవారు జామున 3.30 గంటల ప్రాంతంలో ఆరుగురు అక్కడకు చేరుకోగా, మరో ఐదుగురు వారితో కలిశారు. వీరిలో ఆరుగురే దర్శనానికి వచ్చారని.. మిగిలిన ఐదుగురు మహిళలు.. వీరికి సహాయంగా ఉండేందుకు వచ్చారని పోలీసులు చెబుతున్నారు. పరిస్థితి చేయిదాటకుండా కేరళ ప్రభుత్వం ఆలయ పరిసరాలతోపాటు దారి పొడుగునా భారీగా భద్రతను మోహరించింది.
స్వామి దర్శనానికి మహిళలను అనుమతించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా చాలామంది సంప్రదాయవాదులు అడ్డుకుంటున్న నేపథ్యంలో చెన్నై కేంద్రంగా ఉన్న ఓ ఎన్జీవో సంస్థ.. 10 నుంచి 50 ఏళ్లలోపు వయసు ఉన్న 50 మంది మహిళలతో స్వామివారిని దర్శించుకుంటామని ప్రకటించింది. ఈక్రమంలోనే ఈ 11 మంది మహిళలు పంబ చేరుకున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







