సునామీ బీభత్సం.. 584 మంది..
- December 23, 2018
ఇండోనేషియాలో మరోసారి సునామీ బీభత్సం సృష్టించింది. సండా స్ట్రెయిట్ ప్రాంతాన్ని సునామీ ముంచెత్తడంతో 43 మందికి పైగా మృతి చెందారు. మరో 584 మంది గాయపడ్డారని వెల్లడించారు అధికారులు. పదుల సంఖ్యలో భవనాలు దెబ్బతిన్నాయని తెలిపారు. క్రకటోవా అగ్నిపర్వతం పేలుడు తర్వాత సముద్ర గర్భంలో కొండ చరియలు విరిగిపడి అలజడి కారణంగా ఈ సునామీ వచ్చినట్లు అంచనా వేస్తున్నారు.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు అధికారులు. సునామీ సంభవించిన సమయంలో పశ్చిమ జావా బీచ్‌కు సమీపంలో చాలా మంది ఉన్నారన్నారు. రెండోసారి వచ్చిన అల విధ్వంసం సృష్టించిందని వివరించారు. అంతకు ముందు భారీ పేలుడు శబ్ధం కూడా వచ్చిందన్నారు.
క్రకటోవా అనే అగ్నిపర్వతం 2 నిమిషాల 12 సెకన్ల పాటు విస్ఫోటనం చెందిందని తెలిపారు అధికారులు. దాంతో పర్వతాల మీద దాదాపు 400 మీటర్ల ఎత్తు వరకు బూడిద ఎగిసిపడిందని వెల్లడించారు.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇండోనేషియాలోని పాలూ నగరాన్ని భారీ సునామీ ముంచెత్తింది. ఈ విధ్వంసం ధాటికి 2వేల మంది ప్రాణాలొదిలారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వేలాది భవనాలు ధ్వంసమయ్యాయి. అటు.. 2004 డిసెంబర్ 26న హిందూ మహా సముద్రంలో సంభవించిన భారీ సునామీ వల్ల ఇండోనేషియా సహా 14 దేశాల్లో 2 లక్షల 28 వేల మంది చనిపోయారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







