ఇళయరాజాపై ఫైర్ అవుతున్న నిర్మాతలు
- December 23, 2018
సంగీత దర్శకుడు ఇళయరాజాతో నిర్మాతలు, సింగర్స్ వివాదం ముదురుతోంది. పలు కచేరీల్లో తన పాటలను సింగర్స్ పాడుతుండడంపై ఇటీవల ఇళయరాజా ఆగ్రహంగా ఉన్నారు. కేసులు వేసేందుకు సిద్ధమయ్యారు. తన అనుమతి లేకుండా, తనకు రాయల్టీ చెల్లించకుండా తన పాటలను పాడడానికి వీల్లేదని ఇళయరాజా వాదిస్తున్నారు.
ఇకపై తన అనుమతి లేకుండా తన పాటలను ఏ వేదికపై కూడా పాడడానికి వీల్లేదని. అలా చేస్తే కేసులు వేస్తానని హెచ్చరించారు. ఇప్పటికే పలువురు నుంచి ఐదేళ్లుగా ఇళయరాజా రాయల్టీ కింద డబ్బులు కూడా వసూలు చేస్తున్నారు. ఇళయరాజా ఇలా చేస్తుండడంపై నిర్మాతలు హైకోర్టులో కేసు వేశారు.
నిర్మాతలు సెల్వకుమార్, మీరాకధిరవన్, మణికంఠన్, చంద్రశేఖర్‌లు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. తాను సంగీతం అందించిన పాటలపై పూర్తి హక్కులు తనకే ఉంటాయని ఇళయరాజా డబ్బులు వసూలు చేయడం చట్ట విరుద్దమని నిర్మాతలు కోర్టుకు వివరించారు.
నిర్మాతలు ఇచ్చే డబ్బుతో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారని. అలాంటప్పుడు పాటలపై ఆయనకే పూర్తి హక్కులు ఎలా ఉంటాయని నిర్మాత సెల్వకుమార్ ప్రశ్నించారు. ఇళయరాజా వసూలు చేసిన, వసూలు చేయబోతున్న రాయల్టీలో ఆయా చిత్ర నిర్మాతలకు 50 శాతం చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును నిర్మాతలు కోరారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







