పాక్ నేవీ సిబ్బంది దుర్మార్గం.. తాగడానికి నీళ్లు కూడా ఇవ్వకుండా..
- December 23, 2018
తినడానికి తిండి పెట్టడం లేదు. తాగడానికి నీళ్లు ఇవ్వడం లేదు. ఆకలికి అలమటిస్తూ చచ్చిపోతున్నారు. ఇది పాకిస్తాన్‌లో బందీగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మత్య్సకారుల దుస్థితి. పాక్ చేతిలో బందీగా మారి చిత్ర హింసలకు గురవుతున్నారు తెలుగు మత్య్సకారులు. సాయం కోసం ధీనంగా ఎదురు చూస్తున్నారు.
శ్రీకాకుళంలోని కొన్ని మత్స్యకార కుటుంబాలు ఉపాధి కోసం గుజరాత్ తీర ప్రాంతాలకు వెళ్లాయి. అక్కడ చేపల వేటకు అరేబియా సముద్రంలోకి వెళ్లిన పలువురు ఏపీ మత్స్యకారులు.. మంచుతో దారి తెలియక పాకిస్తాన్ జలాల్లోకి పొరపాటున వెళ్లారు. ఇక అంతే పాకిస్తాన్ నేవీ సిబ్బంది మత్స్యకారులను అదుపులోకి తీసుకొంది. కరాచీకి దగ్గరలో ఉన్న ఐస్‌లాండ్‌లో వారందరిని బంధించింది.
పాక్ ఐస్‌లాండ్‌లో బందీలుగా ఉన్న తెలుగు మత్స్యకారులు తీవ్ర నరకయానత అనుభవిస్తున్నారు. అన్నమే కాదు పచ్చి మంచి నీళ్లు కూడా ఇవ్వకుండా పాక్ నేవీ సిబ్బంది దుర్మార్గంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. వారిని విడిపించే వారు లేక.. ఎవరు పట్టించుకోక గత కొన్ని రోజులుగా అందులోనే మగ్గిపోతున్నారు. కన్నీరు మున్నీరవుతున్నారు.
ఏపీకి చెందిన మత్స్యకారులు పాక్ చెరలో చిత్రహింసలు పడుతుంటే కేంద్ర విదేశాంగ శాఖ ఏం చేస్తోంది? విడిపించాల్సిన బాధ్యత కేంద్ర విదేశాంగకు లేదా? ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు భారత విదేశాంగ శాఖ పాక్ తో మాట్లాడి వారి విడుదలకు చొరవ తీసుకోవాలి. కానీ ఆ ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు. భారత ఫిషర్ మెన్ విడిపించడంలో కేంద్రం చొరవ చూపకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అటు ఏపీ ప్రభుత్వంతో పాటు విపక్షపార్టీలైన బీజేపీ, వైసీపీ, జనసేన కూడా దీనిపై ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్న తలెత్తుతోంది. వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పాక్‌లో బందీలుగా ఉన్న తమవారిని విడిపించేలా చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..