శబరిమల:సన్నిధానం సమీపంలోకి చేరుకున్నఇద్దరు మహిళలు..

- December 24, 2018 , by Maagulf
శబరిమల:సన్నిధానం సమీపంలోకి చేరుకున్నఇద్దరు మహిళలు..

కేరళ:శబమరిమలలో ప్రశాంతత కరువైంది.. ఆదివారం ఏర్పడిన ఉద్రిక్తలు.. రెండో రోజూ కొనసాగుతున్నాయి. పంబ ప్రాంతం వార్‌ జోన్‌గా మారింది. ఆదివారం 11 మంది మహిళల బృందం అయ్యప్ప దర్శనానికి శబరిమలకు చేరుకుంది. ఆలయానికి వెళ్తున్న మహిళా భక్తుల్ని ఆందోళనకారులు అడ్డుకోవడంతో శబరిమల రణరంగంగా మారింది.

 
సోమవారం సన్నిధానానికి కిలోమీటర్‌ సమీపంలోకి ఇద్దరు మహిళలు చేరుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది.. దీంతో వారికి రక్షణగా రెండువేల మంది పోలీసులు రంగంలోకి దిగారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com