సెన్సార్ పూర్తి చేసుకున్న 'పేట్టా' చిత్రం
- December 24, 2018
'పేట్టా' చిత్రానికి సెన్సార్ పూర్తయింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్టు 'యూ/ఏ' సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమాను చూసిన తరువాత అధికారులు, కొన్ని పోరాట దృశ్యాలను మార్చితే, క్లీన్ యూ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పినప్పటికీ, అందుకు చిత్రాన్ని నిర్మించిన సన్ పిక్చర్స్ అంగీకరించలేదని, దీంతో ఎటువంటి కట్స్ లేకుండా 'యూ/ఏ' సర్టిఫికెట్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తో తొలిసారిగా సిమ్రాన్, త్రిష నటించారు. కాగా విజయ్ సేతుపతి, మేఘా ఆకాశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా క్లైమాక్స్ లో భారీ ఫైట్ సీన్ ఉందని, దాని కారణంగానే 'యూ/ఏ' ఇవ్వాల్సి వచ్చిందని సమాచారం.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







