శివాజీ విగ్రహ నిర్మాణానికి రూ.3,643 కోట్లు
- December 24, 2018
ముంబయి: అరేబియా సముద్రం ఒడ్డున నిర్మితమవుతున్న ఛత్రపతి శివాజీ విగ్రహ నిర్మాణాన్ని 2022-23 సంవత్సరంలోపు పూర్తిచేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రూ.3,643.78 కోట్ల బడ్జెట్ను ఇందుకు కేటాయించినట్లు పేర్కొంది. విగ్రహ నిర్మాణం ఖర్చులకు సంబంధించి ప్రభుత్వం ఒక జాబితాను విడుదల చేసింది. మొత్తం బడ్జెట్లో విగ్రహ నిర్మాణానికి రూ.2,581 కోట్లు కేటాయించారు. జీఎస్టీ, భద్రతకు సంబంధించిన మౌలిక సదుపాయాల స్థాపనకు రూ.309.72 కోట్లు, నీటి వనరులు, విద్యుత్ సరఫరా కోసం మరో రూ.45 కోట్లు వెచ్చించనున్నారు. భవిష్యత్ అవసరాల కోసం రూ.112 కోట్లు, విగ్రహ పరిసరాల్లో కంప్యూటరీకరణ కోసం రూ.56కోట్లు, ఇతరత్రాల కోసం రూ. 140 కోట్లు కేటాయించారు. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి విగ్రహ నిర్మాణ పనులు నిరంతరంగా కొనసాగుతాయని ప్రభుత్వ అధికారులు తెలిపారు. 2016లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఇందుకు గానూ రూ.8కోట్లు ఖర్చు చేశారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!