మళయాలంలో డైరెక్టర్ నీలకంఠ
- December 24, 2018
బాలీవుడ్ లో క్వీన్ మూవీతో తిరుగులేని స్టార్డమ్ తెచ్చుకున్న భామ కంగనా రనౌత్. హీరోయిన్ ఓరియంటెడ్ స్టోరీగా వచ్చిన క్వీన్ విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ గానూ అతిపెద్ద విజయం సాధించింది. అలాంటి చిత్రాన్ని దక్షిణాదిలోని అన్ని భాషల్లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. మళయాలంలో 'జామ్ జామ్' పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో మంజిమా మోహన్ కథానాయిక.
కేవలం మలయాళ వెర్షన్‌కు మాత్రమే మన తెలుగు దర్శకుడు నీలకంఠ దర్శకత్వం వహించారు. తెలుగులో షో సినిమాతో జాతీయ అవార్డ్ అందుకున్న నీలకంఠ ఇప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు. ఇక రీసెంట్ గా ఈ రీమేక్ కు సంబంధించిన నాలుగు భాషల టీజర్స్ విడుదలయ్యాయి. మళయాల వెర్షన్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. రీమేక్ అయినా అత్యంత సహజంగా కేరళ నేచురాలిటీకి దగ్గరగా రూపొందుతోంది. మీడియెంట్ ఫిల్మ్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ సినిమాలో మంజిమా మోహన్‌తో పాటు సన్నీవేన్, షిబానీ దండేకర్, బాయిజు, ముత్తుమని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







