భారత్: అతి పెద్ద రోడ్డు, రైల్వే వంతెన ప్రారంభం

- December 25, 2018 , by Maagulf
భారత్: అతి పెద్ద రోడ్డు, రైల్వే వంతెన ప్రారంభం

దేశంలోనే అతిపెద్ద రోడ్ కం రైల్ బ్రిడ్జ్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. అస్సాంలోని దిబ్రూగఢ్‌ నుంచి అరుణాచల్ ప్రదేశ్‌లోని సిలాఫథార్ వరకూ బ్రహ్మపుత్ర నది ఉత్తర, దక్షిణ తీరాలను కలుపుతూ ఉన్న ఈ బోగీబీల్ వంతెన నిర్మించారు. స్థానికంగా రవాణాసౌకర్యాలు మెరుగుపరచడంలో ఇది అత్యంత కీలకమవుతుంది. చైనా సరిహద్దులవైపు రక్షణ పరంగా సైన్యాన్ని తరలించేందుకు, ఆయుధాలు తీసుకెళ్లేందుకు ఈ బ్రిడ్జి కీలకంగా మారుతోంది. ఈ వంతెనపై తొలి ప్యాసెంజర్ రైల్ రాకపోకలను ప్రధాని మోడీ ఇవాళ ప్రారంభిస్తారు. దీనివల్ల ఢిల్లీ నుంచి దిబ్రూఘర్‌కు దాదాపు 4 గంటల జర్నీ టైమ్ తగ్గుతుంది. ఇక అస్సాంలోని తిన్‌సుకియా నుంచి అరుణాచల్ ప్రదేశ్‌లోని నహర్లగన్‌కు 10 గంటల సమయం తగ్గుతుంది. అంటే, 500 కిలోమీటర్ల దూరం ఇప్పుడు 100 కిలోమీటర్లకు తగ్గుతుంది.

ఈ బోగీబీల్ వంతెన పొడవు 5 కిలోమీటర్లు. కింద రైళ్ల కోసం డబుల్ ట్రాక్ ఉంటుంది. పైన మూడు లైన్ల రహదారి ఉంటుంది. దీన్ని ఇంజినీరింగ్ అద్భుతంగానే చెప్పాలి. దాదాపు 5వేల 920 కోట్లతో దీన్ని నిర్మించారు. దాదాపు 21 ఏళ్ల కల నేడు సాకారం అవుతోంది. 1997లో ఈ బోగీబీల్ వంతెన నిర్మించాలని తలపెట్టారు. అప్పటి ప్రధాని దేవెగౌడ శంకుస్థాపన కూడా చేశారు. తర్వాత వాజ్‌పేయి హయాంలో 2002లో పనులకు బీజం పడింది. ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు పూర్తవడంతో అసోం, అరుణాచల్ ప్రదేశ్‌ ప్రజలకు ఇదో వరంగా మారిందనే చెప్పాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com