'జనసేన' కు మెగా ఫండ్స్

- December 25, 2018 , by Maagulf
'జనసేన' కు మెగా ఫండ్స్

పవన్ కళ్యాణ్ తన జనసేన కోసం విరాళాలు సేకరించడానికి వ్యూహాత్మకంగా మెగా సెంటిమెంట్ ప్రయోగిస్తున్నాడు. ఈవిషయంలో తన అభిమానులకు ఉత్సాహం కలగడానికి కొత్త పద్ధతులు ప్రయోగిస్తున్నాడు. దీనిలో భాగంగా పవన్ గతంలో తన తల్లి 'జనసేన' పార్టీకి విరాళం ఇచ్చినప్పుడు ఆసంఘటనకు విపరీతమైన ప్రచారం కల్పించారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి తన అన్నయ్య నాగబాబు అన్నకొడుకు వరుణ్ తేజ్ పార్టీకి విరాళాలిచ్చారంటూ యూరప్ నుంచి పవన్ పెడుతున్న ట్విట్స్ పవన్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారాయి. 

క్రిస్మస్ కానుకగా వరుణ్ తేజ్ నాగబాబులు తమ పార్టీకి ఫండ్ ఇచ్చారని కృతజ్ఞతలు తెలుపుతూ పవన్ ఈవిషయాన్ని అందరికీ తెలిసేలా చేసి తన 'జనసేన' వెనుక ఉన్న మెగా కాంపౌండ్ బలాన్ని వ్యూహాత్మకంగా తెలియచేస్తున్నాడు. ఒకవైపు పవన్ తన 'జనసేన' కోసం విరాళాలు తీసుకోనని చెబుతూనే విరాళాల కోసం విదేశాలు చుట్టేస్తున్నాడు. ఈమధ్య డల్లాస్ లో 'జనసేన' కోసం తెరవెనక విరాళాల సేకరణ కోసం అక్కడకు వెళ్ళాడు అన్న ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.
 
దీనితో ఇలాంటి తెరచాటు కార్యక్రమాలు లేకుండా అధికారికంగానే విరాళాలు తీసుకునే ఉద్దేశంతో పవన్ ఇలా పక్కా ప్రణాళికతో కుటుంబ సభ్యుల నుంచి విరాళాలసేకరించే కార్యక్రమం మొదలు పెట్టాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి. మెగా కుటుంబ సభ్యుల స్ఫూర్తితో తన అభిమాన సంఘా నేతలు అభిమానులు కూడా ఇలా విరాళా కార్యక్రమంలోకి లైన్ లోకి వస్తారు అని పవన్ అభిప్రాయం అనిఅంటున్నారు. ఇందులో భాగంగానే వరుణ్ తేజ్ ప్రకటించిన కోటి రూపాయల విరాళం అదే విధంగా నాగబాబు ప్రకటించిన 25 లక్షలు విరాళం అని అంటున్నారు.
 
అయితే ఇలా కుటుంబసభ్యుల విరాళాలు పవన్ పార్టీకి ఏమేరకు ఉపయోగపడతాయి అన్నవిషయంలో భిన్నాభిప్రయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈమధ్య పవన్ కళ్యాణ్ కు మెగా ఫ్యామిలీ మద్దతు తెలిపే విషయంలో నాగబాబు ఒక అడుగు ముందుకు వేసి బాలకృష్ణ ఎవరో తెలియదు అని చేసిన కామెంట్ సృష్టించిన అలజడి చల్లారకుండానే ఇప్పుడు మెగా కుటుంబ సభ్యుల విరాళాల ప్రక్రియ మొదలైంది. ఏదిఏమైనా 'జనసేన' విరాళాలకు సంబంధించి పవన్ ప్రయోగిస్తున్న ఈ మెగా సెంటిమెంట్ అస్త్రం ఎంత వరకు విజయవంతం అవుతుందో చూడాలి..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com